logo
Updated : 09 Sep 2021 07:57 IST

Train: ఓ మహిళ అడిగారని.. ఏకంగా రైలు నిలిపేశారు..!

ప్రయాణికురాలిని తీసుకొస్తున్న మహిళ

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: ఓ మహిళ అడిగారని రైలు ఆపేసిన ఘటన విశాఖ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 7.35 గంటలకు సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ ప్రత్యేక రైలు స్టేషన్‌ దాటి పోతున్న సమయంలో ఒక్క సారిగా ఆగిపోయింది. గొలుసు ఎవరు లాగారా అని ప్రయాణికులు చూశారు.. కొద్దిసేపు తర్వాత కదిలిన రైలు మళ్లీ ఆగిపోయింది. కారణమేమిటని ఆరా తీయగా.. ఓ మహిళ గార్డు వద్దకు పరుగున వచ్చి, తమ వాళ్లు స్టేషన్‌ బయట ఉండిపోయారని కొద్ది సమయం రైలు ఆపాలని వేడుకుంది. అయితే ఐదు నిమిషాలైనా వాళ్లు రాకపోవడంతో రైలు కదిలింది. ఈలోపు ఆ మహిళ వచ్చి వంతెనపై వస్తున్నారని ఆపాలని కోరింది. పరుగున పైవంతెన వద్దకు వెళ్లి ఓ మహిళను తీసుకొని వచ్చి ఎక్కించడంతో రైలు కదిలింది. రెండు సార్లు రైలు కదిలి స్టేషన్‌లోనే ఉండిపోవడంతో ఆర్పీఎఫ్‌ పోలీసులు అక్కడికి చేరుకొని గార్డును విచారించారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని