logo

తూర్పు తీరంలో ఆగిన చేపలవేట

తూర్పు తీరంలో సోమవారం నుంచి చేపల వేట నిలిచిపోయింది. సముద్ర జలాల్లో ఉన్న బోట్లు, ఇంజిను పడవలు తీరానికి చేరుకున్నాయి. దీంతో చేపలరేవులోని 11 జెట్టీలు కిక్కిరిసిపోయాయి.

Published : 16 Apr 2024 04:02 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తూర్పు తీరంలో సోమవారం నుంచి చేపల వేట నిలిచిపోయింది. సముద్ర జలాల్లో ఉన్న బోట్లు, ఇంజిను పడవలు తీరానికి చేరుకున్నాయి. దీంతో చేపలరేవులోని 11 జెట్టీలు కిక్కిరిసిపోయాయి. 61రోజుల పాటు సముద్ర జలాల్లో చేపల వేటను నిషేధించామని, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ సహాయ సంచాలకులు విజయకృష్ణ స్పష్టం చేశారు. చేపలరేవు సహా ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లలో పూర్తి నిఘా ఉంచామన్నారు. సముద్ర జలాల్లో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో వేట నిషేధం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని