logo

డయల్‌ యువర్‌ సీపీకి స్పందన

నగరవాసుల సమస్యలను తెలుసుకునేందుకు పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ నిర్వహించిన డయల్‌ యువర్‌ సీపీకి విశేష స్పందన లభించింది.

Published : 16 Apr 2024 04:04 IST

ఫోనులో సమస్యలు వింటున్న సీపీ రవిశంకర్‌

ఎంవీపీ కాలనీ, న్యూస్‌టుడే : నగరవాసుల సమస్యలను తెలుసుకునేందుకు పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ నిర్వహించిన డయల్‌ యువర్‌ సీపీకి విశేష స్పందన లభించింది. సోమవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 0891-2523408 నెంబరు ద్వారా కమిషనర్‌కు 37 మంది ఫోన్లు చేసి తమ సమస్యలను వివరించారు. వాటిని నమోదు చేసుకున్న ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం 12 నుంచి 12.30 గంటల వరకు అదనంగా వృద్ధుల కోసం కేటాయించిన సమయంలో 8 ఫిర్యాదులు వచ్చాయి. సీపీతో పాటు జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మంగపతి, ఉపాధ్యక్షురాలు శ్యామల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని