logo

ముగిసిన ఓటు నమోదు గడువు

జిల్లాలో కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి సోమవారంతో గడువు ముగిసింది. జనవరి 23 నుంచి ఈనెల 15వ తేదీ వరకు  72,386 దరఖాస్తులు వచ్చాయి.

Published : 16 Apr 2024 04:05 IST

72,386 దరఖాస్తుల రాక

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి సోమవారంతో గడువు ముగిసింది. జనవరి 23 నుంచి ఈనెల 15వ తేదీ వరకు  72,386 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 49,083 దరఖాస్తులను ఆమోదించి వారి పేర్లను ఓటరు జాబితాల్లో చేర్చారు. 12,761 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 10,542 విచారణ దశలో ఉన్నాయి. జనవరి 22న తుది ఓటరు జాబితాలు వెల్లడించిన తరువాత...ఇంకా అర్హులుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కరించేందుకు ఏడు రోజుల సమయం ఉంది. ఈ కారణంగా ఈనెల 21వ తేదీ నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల వారీ తుది ఓటర్ల సంఖ్య తేలనుంది. తుది జాబితాలతో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా 50వేలకుపైగా ఓటర్లు అదనంగా పెరగనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని