logo

వడ్డాదిలో వైకాపాకు షాక్‌

చోడవరం నియోజకవర్గంలో అధికార వైకాపాకు భారీ షాక్‌ తగిలింది. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది సర్పంచి కోరుకొండ కామలక్ష్మి, ఉప సర్పంచి, దాడి సూరి నాగేశ్వరరావు సహా వివిధ హోదాల్లో ఉన్న వైకాపా నాయకులు

Updated : 16 Apr 2024 05:21 IST

జనసేనలో చేరిన నాయకులు, కార్యకర్తలు

పీవీఎస్‌ఎన్‌ రాజుతో నాయకులు, కార్యకర్తలు

రావికమతం, బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: చోడవరం నియోజకవర్గంలో అధికార వైకాపాకు భారీ షాక్‌ తగిలింది. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది సర్పంచి కోరుకొండ కామలక్ష్మి, ఉప సర్పంచి, దాడి సూరి నాగేశ్వరరావు సహా వివిధ హోదాల్లో ఉన్న వైకాపా నాయకులు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసి సోమవారం జనసేనలో చేరారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు సమక్షంలో కొత్తకోటలో జరిగిన సమావేశంలో వారంతా జనసేన కండువాలు వేసుకున్నారు. వడ్డాది సర్పంచి కామలక్ష్మి, ఉప సర్పంచి, సూరి నాగేశ్వరరావు, పీఏసీఎస్‌ అభ్యక్షుడు దొండా సన్యాసిరావు, వార్డు సభ్యులు అబోతు నూకరాజు, నాయకులు వీర్ల సురేష్‌, పొలిమేర్ల కృష్ణ, కోరుకొండ సూరి అప్పారావు, రైతు సంఘం అధ్యక్షుడు కుబిరెడ్డి వెంకటరమణ, దాడి పెదగోవింద, సయ్యపురెడ్డి చిట్టిబాబు, బత్తుల రాజు, కాళ్ల జగదీష్‌, గొట్టివాడ వరహాలు, వెలుగుల నగేష్‌, ఆదిరెడ్డి రాజు, దూది వరహాలు, షేక్‌ చినఅప్పన్న, బొండా శ్రీను, వెలుగుల వరహాలు తదితర జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. జనసేన నాయకులు అడపా నర్సింహమూర్తి, రామ్మూర్తి, సాయి, రసూల్‌, నవీన్‌, వరహాలు, జనార్దన్‌, తెదేపా నాయకులు గేదెల సత్యనారాయణ, గోకివాడ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని