logo

అతిథిగృహం ఆవరణలో పార్టీల వాహనాలా?

స్థానిక పంచాయతీరాజ్‌ అతిథిగృహం ఆవరణలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల వాహనాలు ఉండటంతో కలెక్టర్‌ రవి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 16 Apr 2024 04:17 IST

అధికారుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

పీఓ, ఏపీఓలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి, ఈవీఎంల వినియోగంపై శిక్షణ పొందుతున్న పీఓ, ఏపీఓలు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: స్థానిక పంచాయతీరాజ్‌ అతిథిగృహం ఆవరణలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల వాహనాలు ఉండటంతో కలెక్టర్‌ రవి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఇక్కడికి వారి కార్లు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. పట్టణంలోని శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లో సోమవారం పీఓ, ఏపీఓలకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గీతాంజలి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. మధ్యాహ్నం కలెక్టర్‌ ఈ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో పీఆర్‌ అతిథిగృహానికి వెళ్లారు. అక్కడ వివిధ పార్టీ వాహనాలు ఉండటం చూసి  తక్షణమే వీటిని తీయించేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో స్వప్న, తహసీల్దారు సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

పారదర్శక పోలింగ్‌కు సన్నాహాలు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ అంతా పారదర్శకంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్డీఓ జయరామ్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఓ, ఏపీఓలు 333 మందికి సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. కలెక్టర్‌ రవి తరగతులను పరిశీలించారు. తహసీల్దారు శ్రీరాములు, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు పాల్గొన్నారు.

వీడియోలు ఎంతో ఉపయుక్తం

గత ఎన్నికల్లో పీఓలుగా పనిచేసిన వారు ప్రస్తుతం ఎందరు ఉన్నారని కలెక్టర్‌ రవి ఆరా తీశారు. ఎన్నికల సంఘం రూపొందించిన వీడియోలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. వీటిని ప్రతి ఒక్కరు నిశితంగా పరిశీలించి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని