logo

రెండో రోజు పది నామినేషన్లు దాఖలు

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్‌వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు.

Published : 20 Apr 2024 03:35 IST

పెందుర్తి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్‌వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. వైకాపా తరఫున పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌.. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పంచకర్ల రమేశ్‌బాబు తరఫున ఆయన సోదరుడు వెంకటేశ్వరరావు నామపత్రాలు సమర్పించారు. అలాగే పంచకర్ల రమేశ్‌బాబు సతీమణి మహాలక్ష్మి జనసేన తరఫున నామినేషన్‌ వేశారు.

సమాజ్‌వాదీ పార్టీ నుంచి బోళెం వెంకట మురళీమోహన్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి ఈత రోజా, జైభారత్‌ నేషనల్‌ పార్టీ నుంచి కన్నేపల్లి మహాదేవ్‌ కల్యాణ్‌ శ్రీకాంత్‌, స్వతంత్ర అభ్యర్థులుగా గుంటూరు వెంకట నరసింహారావు, గుంటూరు సాయిప్రియ, కూండ్రపు సన్యాసిరావు ఒక్కొక్క సెట్ చొప్పున నామపత్రాలు సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థి ఆడారి నాగరాజు రెండు సెట్ల నామపత్రాలు అందించారు.

తొలుత వైకాపా అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తన స్వగ్రామం రాంపురం నుంచి ర్యాలీగా తరలివచ్చారు. నిబంధనల ప్రకారం వంద మీటర్ల ముందు ర్యాలీని నిలిపివేసి ఆర్‌వో కార్యాలయంలో నామపత్రాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని