logo

కూటమి విజయంతోనే అభివృద్ధి

కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు.

Published : 23 Apr 2024 04:27 IST

పరవాడలో పంచకర్లను సత్కరిస్తున్న తెదేపా నాయకులు పైలా సన్యాసిరావు తదితరులు

పరవాడ, న్యూస్‌టుడే: కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. పరవాడ మండలంలో వాడచీపురుపల్లి, నాయుడుపాలెం, ఉక్కునగరం 8, 9, 10, 11, 12 సెక్టారుల్లో సోమవారం ఆయన తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు, కార్యకర్తలు పంచకర్లకు స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. పంచకర్ల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీలుప్లాంటు ప్రయివేటీరణను నిలిపివేయాలని తనతో పాటు గాజువాక అసెంబ్లీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి, విశాఖ ఎంపీ అభ్యర్థులు సీఎం రమేశ్‌, భరత్‌ అంతా కలిసి చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. ఎన్టీపీసీ కాలుష్య సమస్య పరిష్కారంతో పాటు ఎన్టీపీసీలో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మాసరవపు అప్పలనాయుడు, పైలా జగన్నాథరావు, నాయకులు కన్నూరు వెంకటరమణ, కూండ్రపు సన్యాసినాయుడు, కూండ్రపు శ్రీరామ్మూర్తి, మధు, బుగిడి గోవింద, మోటూరు సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు. బీ మండల కేంద్రం పరవాడలోని తెదేపా నాయకులు, కార్యకర్తలతో సోమవారం పంచకర్ల రమేశ్‌బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం పంచకర్లను తెదేపా నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో పైలా సన్యాసిరావు, పైలా చినఅక్కునాయుడు, పైలా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు

వాడచీపురుపల్లిలో మాట్లాడుతున్న పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని