logo

ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ

ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 26 Apr 2024 03:25 IST

ధర్నాలో మాట్లాడుతున్న సిటూ నాయకుడు అయోధ్యరామ్‌

ఉక్కునగరం(స్టీల్‌సెక్టారు-3), న్యూస్‌టుడే : ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఇన్నాళ్లు కార్మికుల క్వార్టర్స్‌కు రాయితీపై యూనిట్‌ ధర రూ.0.49పైసలు వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ధరను రూ.8కి పెంచి, ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. దీంతో సిటూ ఆధ్వర్యంలో గురువారం ప్రధాన పరిపాలన భవనం కూడలిలో ధర్నా నిర్వహించారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెంపు నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సిటూ నాయకులు జె.అయోధ్యరామ్‌, ఎన్‌.రామచంద్రరావు బి.అప్పారావు, బి.గంగారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని