logo

అప్పన్న సన్నిధిలో పూసపాటి కుటుంబం

సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.

Published : 01 May 2024 03:23 IST

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. బుధవారం పీవీజీ శత జయంతి నేపథ్యంలో అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నట్లు అశోక్‌ పేర్కొన్నారు. తొలుత ఈవో సింగల శ్రీనివాసమూర్తి, అర్చకులు అశోక్‌, కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు