logo

పింఛన్‌ లబ్ధిదారులకు తీరని అవస్థలు

పింఛన్‌ బట్వాడా విషయంలో ప్రభుత్వ తీరుతో పేదల కష్టాలు కొనసాగుతున్నాయి.

Published : 07 May 2024 04:29 IST

ఉదయం తొమ్మిదిన్నర సమయంలో నక్కపల్లి బ్యాంకు ఎదుట పింఛన్‌ లబ్ధిదారులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: పింఛన్‌ బట్వాడా విషయంలో ప్రభుత్వ తీరుతో పేదల కష్టాలు కొనసాగుతున్నాయి. అనేకమంది పింఛను సొమ్మును వారి బ్యాంకు ఖాతాలో వేయడంతో వాటిని తీసుకోడానికి సమీప గ్రామాల నుంచి ఉదయాన్నే బ్యాంకులకు చేరుకుంటున్నారు. నక్కపల్లి ఐఓబీ పరిధిలో వేలమంది ఉండటంతో ఇక్కడ రద్దీ తగ్గడంలేదు. దీనికి తోడు ఖాతాలు నిలిచిపోయివారు వాటిని తిరిగి బతికించుకోడానికి వస్తున్నారు. నక్కపల్లిలో ఐఓబీ బ్యాంకు సోమవారం తెరవడానికి ముందే ఇక్కడకు వచ్చి పడిగాపులు కాశారు. ఎక్కువమంది లోపల ఉండటంతో రద్దీని అదుపు చేయడానికి బ్యాంకు, సచివాలయ ఉద్యోగులు కొందరిని బయటే ఉంచేశారు. దీంతో ఎండ వేడితో అవస్థలు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని