logo

కూటమిని గెలిపిస్తే నెలకు రూ.4 వేల పింఛను

కూటమి అభ్యర్థులను గెలిపిస్తే పింఛను నెలకు రూ. 4 వేలు అందిస్తారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని జనసేన పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల ముఖ్యవ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీష్‌కుమార్‌ అన్నారు.

Published : 08 May 2024 03:50 IST

ఎలమంచిలిలో బుల్లితెర తారల సందడి

తులసీనగర్‌లో ప్రచారం చేస్తున్న బుల్లితెర తారలతో సతీష్‌కుమార్‌

ఎలమంచిలి, న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థులను గెలిపిస్తే పింఛను నెలకు రూ. 4 వేలు అందిస్తారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని జనసేన పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల ముఖ్యవ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీష్‌కుమార్‌ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన టీవీ సీరియల్‌ తారలు పూజా మూర్తి, హాసిన తారక్‌, సహస్ర నాయుడుతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. వీరి రాకతో ప్రచారం ప్రత్యేకతను సంతరించుకుంది. వీరిని చూడటానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గాజుగ్లాసు, కమలం గుర్తులపై ఓటు వేసి ఎమ్మెల్యేగా విజయ్‌కుమార్‌ను, ఎంపీగా సీఎం రమేశ్‌ను గెలిపించాలని కోరారు. జగన్‌ని ఇంటికి పంపిస్తే తప్ప రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి మహిళలతో ముచ్చటించారు. కరపత్రాలు అందజేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కూటమి గెలిస్తే రైతులకు ఏడాదికి రూ. 20 వేలు, ప్రతి కుటుంబానికి మూడు వంట గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా అందిస్తారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తారన్నారు. కూటమి నాయకులు లాలం సోమినాయుడు, ఆడారి రమణబాబు, గంధం శివ, సుందరపు శైలజ, సుందరపు దమయంతి, బొద్దపు శ్రీను, ఆడారి ఆదిమూర్తి, మహిళలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు