logo

వైకాపాలో గ్రూపుల గోల?

తూర్పు నియోజకవర్గంలోని 18వ వార్డు వైకాపా ఇన్‌ఛార్జి మార్పు వ్యవహారం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. వార్డు పరిధిలో గ్రూపుల గోలతో నాయకులు, కార్యకర్తలు సతమతమవుతున్నారు.

Published : 09 May 2024 03:53 IST

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : తూర్పు నియోజకవర్గంలోని 18వ వార్డు వైకాపా ఇన్‌ఛార్జి మార్పు వ్యవహారం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. వార్డు పరిధిలో గ్రూపుల గోలతో నాయకులు, కార్యకర్తలు సతమతమవుతున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో 18వ వార్డు నుంచి వైకాపా తరఫున పుక్కళ్ల ధనలక్ష్మీ పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ఆమె వార్డు ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. పార్టీ సమన్వయకర్తగా ఎం.వి.వి.సత్యనారాయణ నియమితులైన తర్వాత కూడా ఆమెనే పార్టీ ఇన్‌ఛార్జిగా ఉంచారు. అయితే ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా అదేవార్డులోని కొంతమంది నాయకులకు ప్రాధాన్యం ఇచ్చినా ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఎన్నికల సమయం కావటంతో ఆమెకు తెలియకుండా అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ వార్డు ఇన్‌ఛార్జిగా విజయచందర్‌ను నియమించారు. అయితే మంగళవారం వార్డులో జరిగిన సిద్ధం సభలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో వార్డు ఇన్‌ఛార్జి విజయచందర్‌ అని ఉండటంతో ధనలక్ష్మీ అవాక్కయ్యారు. ధనలక్ష్మీ, ఆమె భర్త శంకర్‌ చిత్రాలు కూడా చిన్నవిగా ముద్రించి, వాటి కింద సీనియర్‌ నాయకులు అని రాసి ఉండటంతో ధనలక్ష్మీ వర్గానికి ఏమి చేయాలో పాలుపోలేదు. దీంతో ధనలక్ష్మీ వర్గం అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణపై మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు