logo

ఉన్నత విద్యారంగంలో అనూహ్య మార్పులు

ఉన్నత విద్యారంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని సామాజిక శాస్త్రవేత్త హరగోపాల్‌ అన్నారు. సోమవారం కేయూ దూరవిద్యా కేంద్రంలో వీసీ ఆచార్య టి.రమేష్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Updated : 29 Nov 2022 06:57 IST

ప్రసంగిస్తున్న హరగోపాల్‌, వేదికపై వీసీ రమేష్‌ తదితరులు

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: ఉన్నత విద్యారంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని సామాజిక శాస్త్రవేత్త హరగోపాల్‌ అన్నారు. సోమవారం కేయూ దూరవిద్యా కేంద్రంలో వీసీ ఆచార్య టి.రమేష్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. విశ్వవిద్యాలయ విద్యలో జాతీయ విధానాలు అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ ప్రజలకు విశ్వవిద్యాలయాలు జవాబుదారీగా ఉండాలన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే జాతీయ విద్యావిధానం అమలులోకి వచ్చిందన్నారు. ఆచార్య వీఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఉన్నతవిద్యారంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. ఓయూ విశ్రాంత ఆచార్యులు కె.శ్రీనివాసులు మాట్లాడుతూ.. బోధన, పరిశోధన రంగాలకు పెద్దపీట వేయాలన్నారు. కేయూ దూర విద్యకేంద్రం మాజీ సంచాలకుడు మురళి మనోహర్‌ మాట్లాడుతూ..ఉన్నత విద్య అందరికీ అందినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రావు, రాంచంద్రం, సురేష్‌లాల్‌ పాల్గొన్నారు.

అసమానతల్లేని సమాజ నిర్మాణం జరగాలి

కేయూ క్యాంపస్‌: అసమానతలు లేని సమాజ నిర్మాణం జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతిశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యులు కే.శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీ ఆచార్య టీ.రమేష్‌ అధ్యక్షతన జరిగిన డాక్టర్‌ కె.బాలగోపాల్‌ స్మారకోపన్యాసంలో శ్రీనివాసులు ప్రసంగించారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య ఆధిపత్య దోరణి ఉండకూడదన్నారు. మానవ హక్కుల నేత, విశ్రాంత ఆచార్యులు జీ.హరగోపాల్‌ మాట్లాడుతూ..వ్యాపార దృష్టితో రచనలు చేయడం సమాజానికి మంచిదికాదన్నారు. సమాజ మార్పునకు దోహదం చేసే గ్రంథాలు ముఖ్యమన్నారు. న్యాక్‌ మాజీ సంచాలకులు వీ.ఎస్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య టీ.శ్రీనివాస్‌రావు,  కె.మురళిమనోహర్‌, బాలగోపాల్‌ సతీమణి వసంతలక్ష్మీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని