logo

లక్ష్యాలు సాధిస్తున్నా.. పదోన్నతులు ఏవీ!

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందిస్తూ దేశంలోనే రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతున్నా..

Published : 27 Mar 2023 06:04 IST

ఐక్యవేదిక సమావేశంలో పాల్గొన్న వైద్య ఉద్యోగులు

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందిస్తూ దేశంలోనే రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతున్నా.. గత 30 సంవత్సరాలుగా పదోన్నతులు రావడం లేదని వైద్య ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ఐక్యవేదిక సెంట్రల్‌ కోర్‌ కమిటీ నాయకులు బత్తిని సుదర్శన్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక వరంగల్‌, హనుమకొండ జిల్లాల సమావేశంలో పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ కత్తి జనార్దన్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూర్ణచందర్‌, కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌, ఐక్యవేదిక సెంట్రల్‌ కోర్‌ కమిటీ నాయకులు బానోతు నెహ్రూచంద్‌, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రొక్కం దేవిక తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో 160 క్యాడర్ల ఉద్యోగులు, 24 సంఘాల నాయకులు ఐక్యవేదికలో ఉన్నారని,  అందరి సమస్యలు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, అప్తాల్మిక్‌ ఆఫీˆసర్లు, రేడియోగ్రాఫర్లందరినీ రెగ్యులర్‌ చేయాలని, జీవో 317 ద్వారా అన్యాయంగా ఇతర జిల్లాలకు బదిలీ కాబడిన ఉద్యోగులందరినీ తిరిగి వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానించారు.  వరంగల్‌, హనుమకొండ జిల్లాల నుంచి డాక్టర్‌ జయపాల్‌, డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ శశికుమార్‌, బత్తిని సుదర్శన్‌గౌడ్‌, బానోతు నెహ్రూచంద్‌, సుమతి, సుమన, ప్రకాశ్‌రావు, సత్యం, రామ రాజేష్‌ఖన్నా, రవీందర్‌, ప్రకాశ్‌రెడ్డి, కవిత, వేణుగోపాల్‌, వీరేందర్‌, కృష్ణమూర్తి, జ్యోతితో కూడిన 17 మందితో స్టీరింగ్‌ కమిటీని ఎన్నుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని