కొంగొత్తగా..అందమైన జ్ఞాపకం
వేడుకలేవైనా కలకాలం గుర్తుండిపోయేలా భద్రపరు చుకుంటోంది యువలోకం.. ఆ జ్ఞాపకాలు పదిలం చేసుకొనేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది
వేడుకలకు చిరునామాగా ఓరుగల్లు
వేడుకలేవైనా కలకాలం గుర్తుండిపోయేలా భద్రపరు చుకుంటోంది యువలోకం.. ఆ జ్ఞాపకాలు పదిలం చేసుకొనేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా పల్లె అందాల వైపు దృష్టి సారిస్తున్నారు. తమకు అనుకూలమైన బడ్జెట్‌లో ఈ జ్ఞాపకాల దొంతరలను ఫొటోషూట్ రూపంలో నిక్షిప్తం చేసుకుంటున్నారు. కాదేది లోకేషన్‌కు అనర్హమన్నట్లు అడవి.. తండా.. పల్లె.. చెరువుగట్లు.. జలపాతాలు ఇలా ఉమ్మడి వరంగల్‌లోని ప్రకృతి అందాలన్నీ ఫొటోషూట్‌లకు వేదికలవుతున్నాయి.
హనుమకొండలోని కాకతీయ జంతు ప్రదర్శనశాల కూడా ప్రకృతి అందాల మధ్య మరుపురాని జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకొనేందుకు నెలవుగా మారింది. ప్రకృతి అందాలు కనువిందు చేసేలా ఫొటోలు తీసుకుని భద్రపరుచుకునేందుకు వేదికగా మారింది. పుట్టినరోజు, ప్రీ వెడ్డింగ్, శుభకార్యాలకు ఫొటో షూట్ చేసుకునేందుకు అనువుగా మారింది.
* ప్రతి ఫొటో షూట్‌కు కు రూ.1500 నిర్వాహకులకు చెల్లించాల్సి ఉంటుంది. గత ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023వరకు 337 ఫొటో షూట్లు ఇక్కడ నిర్వహించుకున్నారు. దీని ద్వారా రూ.5.05 లక్షల ఆదాయం లభించిందని ఎఫ్‌ఆర్‌వో రాజు తెలిపారు.
న్యూస్‌టుడే, న్యూశాయంపేట
ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ కుటుంబీకులు ఇల్లంతా పూలతో అలంకరించి స్వాగతం పలుకుతున్న వేడుకలు ఇటీవల పల్లెల్లో సాధారణమయ్యాయి. కుంకుమ నీళ్లలో పాపాయి కాళ్లను పెట్టి ముద్రలను తెల్లటి వస్త్రం, కాగితంపై పెట్టించి వీడియోలు తీసి పదిలపరుచుకుంటున్నారు.
* పుట్టిన పాపాయికి ఏడాదిపాటు ప్రతి నెల పుట్టిన రోజు నిర్వహిస్తున్నారు. నెలకొక థీమ్‌తో ఏర్పాటు చేసి పక్కన చిన్నారుల ఫొటోలు తీసుకుంటున్నారు. ఇలా అందమైన జ్ఞాపకాలను మార్కెట్లో తక్కువ ఖర్చుతో లభించే వస్తువులతో ఇంటిని అలంకరిస్తున్నారు.
కొందరు యువకులు ఫొటో, వీడియో షూట్స్ చేసే ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా 25 థీమ్స్‌తో చిన్న ఫిల్మ్‌సిటీలను నెలకొల్పి అందుబాటులోకి తెచ్చారు. పలు రకాల సెట్టింగ్‌లతో నిర్మాణాలు చేపట్టారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఏడాది కిందట దీన్ని ప్రారంభించారు. ప్రీ, పోస్టు వెడ్డింగ్, మెటర్నిటీ, బేబీ షూట్స్ నిర్వహించేలా సౌకర్యాలు కల్పించారు. ఆరు గంటల షూట్‌కు రూ.16 వేలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నెలకు సుమారు 50 వరకు షూట్స్ జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.
గతంలో నగరాలకే పరిమితమైన ప్రీ, పోస్టు వెడ్డింగ్, మెటర్నిటీ, బేబీ షూట్స్, జన్మదిన వేడుకల నయా సంస్కృతి ప్రస్తుతం పల్లెలకూ పాకింది. ఎవరి ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా జీవితంలో అందమైన జ్ఞాపకంగా గుర్తుండేలా చిత్రీకరించుకుంటున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా అదిరే అందమైన ప్రాంతాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నెలువైంది. వరంగల్ జూ పార్కు, లక్నవరం, భద్రకాళి బండ్ ఇలా అనేక షూటింగ్ ప్రదేశాలే కాకుండా పల్లెల్లోని ప్రకృతి వనాలు..చెరువు గట్లు.. పచ్చని పొలాలు అదిరే అందాలనిస్తున్నాయి. వీటికి తగినట్లుగా 25 థీమ్స్‌తో చిన్న ఫిల్మ్‌సిటీలను అందుబాటులోకి తెచ్చారు. ఫొటోలు తీసుకునే వారికి జ్ఞాపకాలు పదిలం చేసుకుని మురిసిపోవడం ఒక ఎత్తైతే.. షూటింగ్ స్పాట్ల ద్వారా ఆ ప్రాంతాలకు ఆదాయమూ లభిస్తోంది.
పల్లె అందాలతో..
ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయించుకోవాలంటే పెళ్లికి నెల రోజుల ముందే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువ కేటాయించాల్సి వస్తోంది. బడ్జెట్ గురించి ఆలోచించే పేద, మధ్యతరగతి కుటుంబాలు షూటింగ్ కోసం తక్కువ ఖర్చుతో పాటు సమయం వృథా కాకుండా ఉండే ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. పల్లె ప్రకృతి వనాలు, చెరువు గట్లు, గుట్టలు, పచ్చని అటవీ ప్రాంతాలతో పాటు ఏజెన్సీలోని గుడిసెలను, పూరిళ్ల ప్రాంతాలను ఎంచుకుని షూటింగ్ చేయించుకుంటున్నారు.
న్యూస్‌టుడే, టేకుమట్ల(భూపాలపల్లి జిల్లా)
ఛార్జీలు ఇలా
గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న లోకేషన్లలో ఫొటోగ్రఫీ చేయించుకుంటే రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆల్బమ్ ఖర్చులు అదనం. థీమ్స్‌తో ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఎనిమిది గంటలకు రూ.25 వేలు తీసుకుంటున్నారు. ఇతర ఖర్చులు రూ.30 వేలు అవుతున్నాయి. ఫొటో షూట్ చేయించుకుంటే రూ.15 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఛార్జీలు ఉన్నట్లు ఫొటోగ్రాఫర్లు చెబుతున్నారు. ఫోటో షూట్‌లో అధునాతన కెమెరాలు, పరికరాలు ఉపయోగిస్తున్నారు. కెమెరా, డ్రోన్, క్యాడిండ్ వీడియో, ఫొటోగ్రఫీ, సినిమాటెక్, అవుట్, ఇన్ డోర్ లైటింగ్ సిస్టమ్స్‌ను వినియోగిస్తున్నారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామ సమీపంలో పర్యాటకులను ఆకర్షిస్తున్న లక్నవరం సరస్సు, దానిపై నిర్మించిన తీగల వంతెన, సరస్సు మధ్యలో ఉన్న ఐలాండ్ దీవిలో ప్రస్తుతం ప్రీవెడ్డింగ్, పుట్టిన రోజు వేడుకలు జోరుగా జరుగుతున్నాయి. ఫొటోలు, వీడియోలు తీసుకునే వారు ముందస్తుగా రూ.5 వేలు చెల్లించి టికెట్ తీసుకోవాలి. ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడ షూట్స్ జరుగుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
న్యూస్‌టుడే, గోవిందరావుపేట
పరిసరాల్లోనే షూట్ చేయించుకున్నాం
- నూకల శ్రీకాంత్, టేకుమట్ల
గతనెల 7న వివాహం జరిగింది. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం దూరప్రాంతాలకు వెళ్లలేకపోయాం. సమయం కూడా తక్కువగా ఉంది. మండలంలోని పరిసర గ్రామాల్లోని అందాలను గుర్తించి అక్కడికి వెళ్లి ఫొటో షూట్ చేయించుకున్నాం. ఖర్చుతో పాటు సమయం వృథా కాకుండా ఆదా చేసుకున్నాం.
వినియోగదారులకు ఇష్టమైన రీతిలో
- సతీష్, ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
25 ఏళ్లుగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాను. ఒకప్పుడు మేము చెప్పినట్లుగా వినియోగదారులు విని ఫొటో తీయించుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వారికి నచ్చినట్లుగా ఫొటోలు తీయాల్సి వస్తోంది. షూటింగ్ స్పాట్లు కూడా వారు చెప్పిన చోటికే వెళ్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి