logo

Jangaon: పల్లె, పట్నం కలబోత.. చైతన్యానికి ప్రతీక

ఏడు పదుల ఎన్నికల చరిత్ర కలిగిన జనగామ నియోజకవర్గం హైదరాబాద్‌ స్టేట్‌లో, ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది.

Updated : 26 Oct 2023 07:22 IST

నియోజకవర్గం ముచ్చట
న్యూస్‌టుడే, జనగామ

ఏడు పదుల ఎన్నికల చరిత్ర కలిగిన జనగామ నియోజకవర్గం హైదరాబాద్‌ స్టేట్‌లో, ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది. నియోజకవర్గాల పునర్విభజన, జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి అనేక రాజకీయ, సామాజిక మార్పులకు సాక్షిగా ఉన్న ఈ శాసనసభ నియోజకవర్గం ఇటు జనగామ, అటు సిద్దిపేట జిల్లాల్లో విస్తరించింది.

ఘన చరిత్ర..

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వేదికగా, నక్సల్స్‌ ఉద్యమానికి వెన్నుదన్నుగా, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊతంగా నిలిచిన ఘన చరిత్ర జనగామ నియోజకవర్గానిది. కొమురవెల్లి మల్లన్న, కొడవటూరు సిద్ధన్న, బెక్కల్‌ రామలింగేశ్వర స్వామి క్షేత్రాలతో ఆధ్యాత్మిక ప్రాంతంగా విలసిల్లుతోంది. మరో జలియన్‌ వాలాబాగ్‌గా పేరు గాంచిన వీర బైరాన్‌పల్లి, హస్తకళలకు విశ్వఖ్యాతి పేరు గడించిన పెంబర్తి ఇక్కడివే. దేవాదుల ఎత్తిపోతల పథకంలో నిర్మించిన జలాశయాలతో ఏటా మూడు పంటల సాగుతో ధాన్యాగారంగా ప్రసిద్ధి పొందుతోంది.

సంక్షిప్తంగా..

  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ కార్పొరేషన్‌ తర్వాత పాత పురపాలికగా, తాలూకా, సమితి, నియోజకవర్గ కేంద్రంగా ఉన్న జనగామ జిల్లా హోదాను సంతరించుకుంది.
  • జనగామ నియోజకవర్గం (నెంబరు 98) జనగామ, జనగామ రూరల్‌, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పుల, చేర్యాల పట్టణం, చేర్యాల రూరల్‌ మద్దూరు, ధూల్మిట్ట, కొమురవెల్లి మండలాలతో పాటు జనగామ, చేర్యాల పురపాలికలతో కూడి ఉంది. మొత్తం పంచాయతీలు 131.  
  • 1952లో ఏర్పడిన జనగామ నియోజకవర్గానికి 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 16వ ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది.
  • 1999 నుంచి 2009 వరకు పొన్నాల లక్ష్మయ్య వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన నేతగా రికార్డు సృష్టించారు. మొత్తంగా ఆయన ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేసి నాలుగు సార్లు విజయం సాధించారు. నలుగురు ముఖ్యమంత్రుల సారథ్యంలో మంత్రిగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఇటీవల భారాసలో చేరారు.
  • ఎమ్మెల్యేగా పనిచేసిన కమాలుద్దీన్‌ అహ్మద్‌ తర్వాత వరంగల్‌ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా, విదేశీ రాయబారిగా ఎదిగారు.

అభ్యర్థులు

భారాస.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి
భాజపా.. ఆరుట్ల దశమంతరెడ్డి
కాంగ్రెస్‌..  ప్రకటించాల్సి ఉంది..

నియోజకవర్గ ఓటర్ల వివరాలు

పురుషులు 1,14,626
మహిళలు 1,14,973
ఇతరులు 10
మొత్తం 2,29,609
సర్వీస్‌ ఓటర్లు132
ఎన్‌ఆర్‌ఐలు 7

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని