logo

మొక్కల సంరక్షణ తప్పనిసరి

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని అటవీ శాఖ సర్కిల్‌ సీసీఎఫ్‌ ప్రభాకర్‌ బుధవారం జిల్లా అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌తో కలిసి ఏటూరునాగారం కార్యాలయంలోని నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేశారు.

Published : 28 Mar 2024 03:52 IST

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని అటవీ శాఖ సర్కిల్‌ సీసీఎఫ్‌ ప్రభాకర్‌ బుధవారం జిల్లా అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌తో కలిసి ఏటూరునాగారం కార్యాలయంలోని నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎన్ని లక్షల మొక్కలు పెంపకం చేపడుతున్నారో జిల్లా అటవీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. సంరక్షణ కార్యక్రమాలు నిత్యం చేపట్టి వర్షాకాలం తొలకరిలోనే మొక్కలను నాటాలన్నారు. నర్సరీల్లో పెంపకం చేపట్టిన ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా చూడాలన్నారు. ఉత్తర మండల రేంజ్‌ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయని, నిత్యం పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. రేంజ్‌ అధికారులు నరేందర్‌, బాలరాజు, డీఆర్‌వోలు, సెక్షన్‌, బీట్‌ అధికారులు పాల్గొన్నారు.


బొగత సందర్శన

వాజేడు: బొగత జలపాతాన్ని ప్రభాకర్‌ సందర్శించి పర్యాటకులు నీటి ధారలను తిలకించేందుకు వ్యూ పాయింట్‌ నిర్మించాలని ఆదేశించారు. పర్యాటకుల ఉల్లాసానికి అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. వరద ప్రవాహం వెళ్లేందుకు వీలుగా నిర్మాణం ఉండాలన్నారు. సందర్శనకు వచ్చే వారికి భోజన వసతి కల్పించేందుకు క్యాంటీన్‌ను ప్రారంభించాలని తెలిపారు. బొగత పరిసరాల్లో ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్‌ పాత్‌ నుంచి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఫైర్‌ లైన్స్‌ ఏర్పాటును అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు నివారణకు సమీప గ్రామాల ప్రజలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని