logo

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి..

ప్రజా సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, అది తమ తండ్రి కడియం శ్రీహరి నుంచి నేర్చుకున్నానని, తమకు దోచుకోవాల్సిన అవసరం లేదని వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు.

Published : 16 Apr 2024 04:38 IST

పాలకుర్తి, న్యూస్‌టుడే: ప్రజా సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, అది తమ తండ్రి కడియం శ్రీహరి నుంచి నేర్చుకున్నానని, తమకు దోచుకోవాల్సిన అవసరం లేదని వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం పాలకుర్తిలోని ఓ వేడుకల మందిరంలో నిర్వహించిన నియోజకవర్గ సన్నాహాక సమావేశానికి ఆమె ఎమ్మెల్యేలతో కలిసి హాజరై మాట్లాడారు. శ్రీహరి మచ్చలేని వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నారని, ఎప్పుడూ దిగజారలేదన్నారు. భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ గత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన భూకబ్జాలు, రియల్‌ దందాలతో రైతుల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. తాను స్థానికురాలినని, కానీ ఆయన నాన్‌లోకల్‌ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మాదిరిగానే తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. అనంతరం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. కావ్య గెలిస్తే ఇద్దరం అక్కాచెల్లెళ్ల లాగా నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తామన్నారు. తర్వాత లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. ఓటమి తెలియని ఎర్రబెల్లి దయాకర్‌రావును ప్రజలు పాలకుర్తి నుంచి పర్వతగిరికి పంపారన్నారు. మోదీ పాలనలో దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కావ్య గెలుపు దాదాపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ పసునూరి దయాకర్‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఝాన్సీరెడ్డి, పార్టీ జిల్లా, మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని