logo

వైద్యపట్టా లేనివారు చికిత్స చేయొద్దు

ఎలాంటి వైద్య పట్టాలేనివారు చికిత్స చేయరాదని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు.

Published : 16 Apr 2024 05:11 IST

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఎలాంటి వైద్య పట్టాలేనివారు చికిత్స చేయరాదని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. సోమవారం వైద్య టాస్క్‌ఫోర్సు టీం సభ్యులు డాక్టర్‌ మాగంటి శేషుమాధవ్‌, డాక్టర్‌ వేములపల్లి నరేశ్‌కుమార్‌, డాక్టర్‌ కొలిపాక వెంకటస్వామి సీపీని కలిసి నకిలీ వైద్యులు, వైద్యసంస్థలపై జరిపే తనిఖీలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీపీ స్పందిస్తూ.. సంబంధిత పట్టాలేనివారు వైద్యం చేయరాదని, ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలన్నారు. రాష్ట్ర వైద్యమండలి(టీఎస్‌ఎంసీ)లో రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా వైద్యం చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని