logo

రాములోరి కల్యాణానికి వేళాయె

శ్రీరామనవమి పురస్కరించుకొని కాళేశ్వర దేవస్థానం అనుబంధ రామాలయంలో నేడు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో అర్చకులు సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని నిర్వహించనున్నారు.

Published : 17 Apr 2024 04:42 IST

పంచ రంగులతో తీర్చిదిద్దిన కల్యాణ మండపం

కాళేశ్వరం, న్యూస్‌టుడే : శ్రీరామనవమి పురస్కరించుకొని కాళేశ్వర దేవస్థానం అనుబంధ రామాలయంలో నేడు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో అర్చకులు సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. కల్యాణ మండపంలో ప్రత్యేక పీఠంపై ఉత్సవ దేవతామూర్తులను ఆసీనులను గావించి కల్యాణ తంతు చేపట్టనున్నారు. టీఎస్‌ఎండీసీ ఉన్నతాధికారి సుమారు 500 మంది భక్తులకు అన్నదానం చేసేందుకు ముందుకు రాగా దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పూర్వం నుంచి కాళేశ్వరం వాస్తవ్యులైన గందెసిరి కుటుంబీకులు రాములోరి కల్యాణానికి ఏటా తలంబ్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. నేడు జరిగే కల్యాణానికి తలంబ్రాలతో పాటు దేవతామూర్తులకు రూ.10 వేల విలువైన పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని