logo

నెలలో.. మరింత దిగువకు..!

ప్రస్తుత వేసవిలో జిల్లాలో రోజు రోజుకు భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జిల్లాలో భూగర్బ జలశాఖ తాజా నివేదిక ప్రకారం జిల్లా సగటు మొత్తం ప్రాంత భూగర్భ నీటి స్థాయి 5.59 మీటర్లు ఉండగా నెల రోజుల్లోనే 6.36 మీటర్ల లోతుకు పడిపోయింది.

Published : 17 Apr 2024 04:50 IST

జిల్లాలో తగ్గిన భూగర్భ జలాలు
న్యూస్‌టుడే, మానుకోట, మహబూబాబాద్‌ రూరల్‌

మహబూబాబాద్‌ మండలంలోని శనగపురం వద్ద వ్యవసాయ బావిలో క్రేన్‌తో పూడికలు తీస్తున్న పరిస్థితి

 ప్రస్తుత వేసవిలో జిల్లాలో రోజు రోజుకు భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జిల్లాలో భూగర్బ జలశాఖ తాజా నివేదిక ప్రకారం జిల్లా సగటు మొత్తం ప్రాంత భూగర్భ నీటి స్థాయి 5.59 మీటర్లు ఉండగా నెల రోజుల్లోనే 6.36 మీటర్ల లోతుకు పడిపోయింది. జిల్లాలో రెండు మండలాలు తప్ప మిగతా 16 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో రైతులకు సాగునీరు, కొన్ని చోట్ల ప్రజలకు తాగునీరు సమస్యగా మారింది. ముఖË్యంగా రైతులు ఈ యాసంగిలో జిల్లాలో నీటి అవసరం ఎక్కువగా ఉండే ప్రధాన ఆహార పంటయిన చివరి దశలో ఉన్న వరిని కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ఆధారిత సేద్యం చేస్తున్న రైతన్నలు బావుల్లో వేలాది రూపాయలు వెచ్చించి క్రేన్‌లతో పూడికలు తీయిస్తున్నారు. ఇంకా ఎండలు బాగానే ముదురుతుండడంతో ఇంకా భూగర్భ జలాల పరిస్థితి సమస్యగానే మారనుందని భావిస్తున్నారు.

వర్షాలు కురియకనే..

జిల్లాలో 2023 వానాకాలం సీజన్‌లో వర్షాలు అంతగా కురియక పోవడం వల్ల సాగునీటి వనరుల్లో నీరు అంతంత మాత్రంగానే ఉంది. భూగర్భ జలాల పరిస్థితి కూడా నిరాశజనకంగానే ఉంటోంది. ఈ యాసంగి వచ్చే సరికి ఆకేరు, బయ్యారం చెరువులాంటి జల వనరుల్లో నీటి లభ్యత తగ్గింది. ఎస్సారెస్పీ జలాలు కూడా అంతంత మాత్రంగా వచ్చాయి. గత సంవత్సరం మార్చి నెలతో పోలిస్తే కూడా ఈ మార్చిలో జిల్లాలోని వివిధ మండలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని