logo

చేసిన పనులకు బిల్లులివ్వకపోతే చనిపోతా..

‘పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన ప్రకారం ప్రజలకు అత్యవసర పనులు చేస్తే.. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు బిల్లులు చేయకుండా అవస్థలు పెడుతున్నారు.

Published : 18 Apr 2024 05:49 IST

తాజా మాజీ సర్పంచి ఆవేదన

రఘునాథపల్లి, న్యూస్‌టుడే : ‘పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన ప్రకారం ప్రజలకు అత్యవసర పనులు చేస్తే.. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు బిల్లులు చేయకుండా అవస్థలు పెడుతున్నారు. పనులకు తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నాను. బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ’ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం తాజా మాజీ సర్పంచి ముప్పిడి శ్రీధర్‌ బుధవారం సామాజిక మాధ్యమాల్లో వీడియో, ప్రకటన విడుదల చేయడం కలకలం సృష్టించింది. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చిన్నాభిన్నమై ప్రజలు అవస్థలు పడుతుంటే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, పంచాయతీ తీర్మానం మేరకే రూ.15 లక్షల పనులు చేశానని పేర్కొన్నాడు. పదవీకాలం ముగిసినా ఇంతవరకు ఎంబీ రికార్డు చేయడం లేదని, పైగా సంబంధిత ఏఈ ఎందుకు పనులు చేశావంటూ బుకాయించడంతోపాటు, పంచాయతీ తీర్మానాన్ని చింపేయాలని పంచాయతీ కార్యదర్శికి హుకుం జారీ చేశాడని ఆరోపించారు. ఉన్నతాధికారులకు తెలిపినా స్పందన లేదని ఆవేదన వెలిబుచ్చాడు. త్వరగా బిల్లులు చెల్లించాలని లేకపోతే చనిపోతానని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో, ప్రకటన వైరల్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని