logo

సుధీర్‌కుమార్‌కు భారాస బీఫారం

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌కుమార్‌కు బీఫారం అందజేశారు.

Published : 19 Apr 2024 04:12 IST

బీఫారం అందజేస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌

బాలసముద్రం, న్యూస్‌టుడే : భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌కుమార్‌కు బీఫారం అందజేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, శాసనమండలి వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్‌ తదితర ఉమ్మడి వరంగల్‌ జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.


 పూజలు చేసి.. ప్రచారానికి భాజపా శ్రీకారం

రంగంపేట, న్యూస్‌టుడే: ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి అమ్మవారిని గురువారం భాజపా వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి అరూరి రమేశ్‌, వరంగల్‌ పార్లమెంటరీ ప్రబారి మురళీధర్‌, కన్వీనర్‌ కుమారస్వామి, రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, నిశిధర్‌రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్‌, వరంగల్‌ తూర్పు నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు దర్శించుకున్నారు. అనంతరం భాజపా ప్రచార వాహనాలకు పూజలు చేసి, ప్రారంభించారు. నాయకులు రావుల కిషన్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.


తొలిరోజు మూడు నామపత్రాలు దాఖలు

నామపత్రాల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు సూచనలు చేస్తున్న రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య

వరంగల్‌ కలెక్టరేట్‌: లోక్‌సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు మూడు నామపత్రాలు దాఖలైనట్లు వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య తెలిపారు. అలియన్స్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ పార్టీ(ఆదార్‌) అభ్యర్థిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లికి చెందిన అంబోజు బుద్దయ్య, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(పీపీఐ) పార్టీ అభ్యర్థిగా కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లికి చెందిన తోటపల్లి నర్మదతో పాటు వరంగల్‌ జిల్లాకు చెందిన మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కో సెట్‌ చొప్పున కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారని వెల్లడించారు. తొలిరోజు ఏఒక్క ప్రధాన పార్టీల అభ్యర్థి నామపత్రాలు సమర్పించేందుకు ఆసక్తి చూపించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని