logo

బలరాంనాయక్‌ నామపత్రం దాఖలు

మహబూబాబాద్‌ (ఎస్టీ) లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్‌ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 20 Apr 2024 01:56 IST

మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో మహబూబాబాద్‌, పినపాక ఎమ్మెల్యేలు భూక్యా మురళీనాయక్‌, పాయం వెంకటేశ్వర్లుతో కలిసి రిటర్నింగ్‌ అధికారి అద్వైత్‌కుమార్‌కు నామపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ (ఎస్టీ) లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్‌ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో మహబూబాబాద్‌, పినపాక ఎమ్మెల్యేలు భూక్యా మురళీనాయక్‌, పాయం వెంకటేశ్వర్లుతో కలిసి రిటర్నింగ్‌ అధికారి అద్వైత్‌కుమార్‌కు నామపత్రం అందజేశారు. డోర్నకల్‌, ఇల్లందు ఎమ్మెల్యేలు జాటోతు రామచంద్రూనాయక్‌, కోరెం కనకయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్‌రెడ్డితో కలిసి రెండోసెట్‌ దాఖలు చేశారు. బలరాంనాయక్‌ స్థానిక రామాలయంలో నామినేషన్‌ పత్రాన్ని నింపి భార్య, కుమారులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరాడంబరంగా రెండు సెట్లు నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్నారు. లోక్‌సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు సమష్టిగా పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారన్నారు.

స్వతంత్ర అభ్యర్థులుగా మణుగూరుకు చెందిన పాల్వంచ దుర్గ, నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని ముదిగొండకు చెందిన జాటోతు రఘునాయక్‌, ఇటుకాలపల్లికి చెందిన బోడ అనిల్‌నాయక్‌ తన నామపత్రాలను దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని