logo

‘ఇన్నర్‌ రింగ్‌రోడ్డు’ భూ బాధితుల ఆందోళన

ఖిలావరంగల్‌ పరిసర ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్న అంతర వలయ రహదారి(ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు) భూ బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు.

Published : 01 May 2024 05:54 IST

రంగశాయిపేట, న్యూస్‌టుడే: ఖిలావరంగల్‌ పరిసర ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్న అంతర వలయ రహదారి(ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు) భూ బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. వరంగల్‌- ఖమ్మం ప్రధాన రహదారి మీదుగా ఆర్టీఏ కార్యాలయం, పుల్లాయికుంట, ఖిలావరంగల్‌ మట్టికోటను ఆనుకొని గొర్రెకుంట వరకు నూతనంగా నిర్మిస్తున్న రహదారి పనులను వారు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చే వరకు పనులు నిలిపి వేయాలంటూ నినాదాలు చేస్తూ గుత్తేదారుతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు కోసం ‘కుడా’ అధికారులు 390 మంది రైతుల నుంచి భూములు సేకరించగా.. ఇప్పటి వరకు 180 మందికి పరిహారం ఇచ్చారు. మరో 210 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఖిలావరంగల్‌ ప్రాంతానికి చెందిన బాధితులకు సుమారు రూ.83 కోట్లు చెల్లించాల్సి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్స్‌కాలనీ సీఐ మల్లయ్య ఘటనా స్థలానికి చేరుకొని సర్దిచెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఆందోళన చేయొద్దని సూచించారు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌కు తరలివెళ్లారు. పనులకు ఆటంకం కలిగించిన 9మందిపై కేసు నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని