logo

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు గడువు పెంపు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయడానికి గడువు ఈ నెల 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య తెలిపారు.

Published : 09 May 2024 01:50 IST

మట్టెవాడ[, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయడానికి గడువు ఈ నెల 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య తెలిపారు. వరంగల్‌ పార్లమెంట్ పరిధిలో జారీ చేసిన 12,710 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బుధవారం వరకు 9,544 మంది వినియోగించుకున్నారని తెలిపారు. మిగిలినవారు పెంచిన గడువు వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు.


ఎనుమాముల మార్కెట్‌కు ఎన్నికల సెలవులు

ఎనుమాముల మార్కెట్‌, నూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న ఈవీఎంల పంపిణీ (డిస్ట్రిబ్యూషన్‌), 13న పోలింగ్‌ నేపథ్యంలో రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య ఆదేశాల మేరకు వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 10 నుంచి 14 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కార్యదర్శి జి.రెడ్డి బుధవారం తెలిపారు. ఈ నెల 15న బుధవారం మార్కెట్‌కు వారాంతపు బంద్‌ కారణంగా మూసి ఉంటుందన్నారు. తిరిగి ఈ నెల 16 నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరుగుతాయన్నారు.


పోలింగ్‌ కేంద్రాల స్థానాలు

ఈనాడు, మహబూబాబాద్‌: పోలింగ్‌ కేంద్రాలు అంటే అందరికీ తెలుసు. పోలింగ్‌ కేంద్రాల స్థానాలు (పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్స్‌) అంటే ఏమిటో తెలుసా.. పోలింగ్‌ కేంద్రాల సముదాయాన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఉదాహరణకు ఒక గ్రామంలో ఉండే రెండు, మూడు పోలింగ్‌ కేంద్రాలను కలిపితే పోలింగ్‌ కేంద్రాల స్థానం అవుతుంది. మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 1809 పోలింగ్‌ కేంద్రాలుండగా అవన్నీ 1174 పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్స్‌ పరిధిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని