logo

ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి

లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపర్చిన పోరిక బలరాంనాయక్‌ను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య పిలుపునిచ్చారు.

Published : 09 May 2024 01:59 IST

ప్రసంగిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య

పస్రా,(గోవిందరావుపేట), న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపర్చిన పోరిక బలరాంనాయక్‌ను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య పిలుపునిచ్చారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఎన్నికల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలతో దేశ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న భాజపాను ఓడించాలన్నారు. భాజపా పదేళ్ల పాలనలో దేశానికి ఒరిగిందేమి లేదన్నారు. ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతూ కార్పొరేట్‌ శక్తులకు ప్రజల సొమ్మును దోచిపెట్టిందని, ఎటక్టోరల్‌ బాండ్ల పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కార్మికులకు ఫ్లోర్‌ లెవల్‌ కనీస వేతనాన్ని రోజుకు రూ.178గా నిర్ణయించడం దారుణమని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు బాటలు వేసిందన్నారు. దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేంద్రం భర్తీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని, 90 శాతం నిరుద్యోగం పెరిగిందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఈడీ, సీబీఐ, ఈసీ, ఐటీ లాంటి చట్టబద్ధ సంస్థలను భాజపా తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు దుర్వినియోగపరుస్తుందని, ఇలాంటి భాజపాకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వీరయ్య పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, నాయకులు ఆర్‌.రాజేందర్‌, బి.సాంబశివ, డీసీసీ అధ్యక్షుడు పి.అశోక్‌, కాంగ్రెస్‌ సమన్వయకర్త అనిల్‌కుమార్‌, మండలాధ్యక్షుడు పి.వెంకటకృష్ణ, సీపీఎం నాయకులు జి.వాసు, కె.రఘుపతి, పి.చిట్టిబాబు, ఎండీ.దావూద్‌, టి.ఆగిరెడ్డి, కె.శ్రీను, గఫూర్‌ఖాన్‌, చిన్ని, చిరంజీవి, ఐలయ్య, సుధాకర్‌, నాగరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని