logo

ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కండి

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవ్వాలని రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published : 09 May 2024 02:00 IST

అధికారులకు వివరిస్తున్న రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవ్వాలని రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల సహాయ రిటర్నింగ్‌ అధికారులతో ఎన్నికల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలని, పెండింగ్‌ పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. పోలింగ్‌కు 72 గంటల ముందు పాటించాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ఈ నెల 12న డిస్ట్రిబ్యూషన్‌ రిసెప్షన్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను అంశాల వారీగా సమీక్షించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎల్‌ఓలతో కూడిన హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి 20 పోలింగ్‌ కేంద్రాలకు ఓ అధికారిని, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జిల్లాస్థాయి అధికారులను నియమించి, పోలింగ్‌ రోజున ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్‌శాతం నివేదిక పంపించాలన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ అశ్వినీ తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, రాధిక గుప్తా, ఏఆర్వోలు రోహిత్‌సింగ్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని