logo

లెక్క తేలింది!

నూతన విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది. 2021-22 విద్యా సంవత్సరంలో 250 మీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను

Published : 28 May 2022 04:47 IST

తరగతుల విలీనంపై మరో ఉత్తర్వు

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే : నూతన విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది. 2021-22 విద్యా సంవత్సరంలో 250 మీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. జిల్లాల విభజన అనంతరం ఒక కిలో మీటరు పరిధిలోని ఆయా తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో దీనిని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా వివరాలు సేకరించాలని డీఈవోలకు ఇటీవల ఆదేశాలందాయి. ఏలూరు జిల్లాలో ఉన్నత పాఠశాలలకు ఒక కిలో మీటరు పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల వివరాలను ఎంఈవోల ద్వారా సేకరించారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా.. 250 మీటర్ల పరిధిలోని 216 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను 197 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాల్సి వచ్చింది. సుమారు 16 వేల మంది విద్యార్థులను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. కానీ తగినన్ని తరగతి గదులు అందుబాటులో లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత వంటి కారణాలతో కొంత మంది విద్యార్థులను 2021-22 విద్యాసంవత్సరం పూర్తయ్యే వరకు ఆయా ప్రాథమిక పాఠశాలల్లోనే కొనసాగించారు.

తాజా మార్గదర్శకాలననుసరించి ఒక కిలో మీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను లెక్కలోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లాలో ఇలాంటివి 189 ఉన్నట్లు గుర్తించారు. వీటిని 119 ఉన్నత పాఠశాలలల్లో విలీనం చేయాల్సి ఉంది. 8,682 మంది విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. తాజా విలీన ప్రక్రియ నేపథ్యంలో మొదట విలీనం చేసిన పాఠశాలలన్నీ ఒక కిలో మీటరు పరిధిలోని జాబితాలోకి చేరాయి.

పశ్చిమగోదావరి జిల్లాలోనూ వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై ఆర్జేడీలు, డీఈవోలతో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని విజయవాడలో శుక్రవారం నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనరు సురేశ్‌కుమార్‌ తదితర ఉన్నతాధికారులు ఆర్జేడీలు, డీఈవోలకు పలు సూచనలు ఇచ్చారు. ఈ బాధ్యతలను డీఈవోలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని