logo

నవ్విపోతారని.. మాయం చేసేశారు..!

రెండేళ్ల కిందట పెనుమంట్ర మండలం మాముడూరులో ఆర్‌బీకే నిర్మాణానికి సాక్షాత్తు ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్నే మాయం చేసేశారు. 2021 జూన్‌ 19న స్థానిక ఎమ్మెల్యే ఆర్బీకే పనులకు శంకుస్థాపన చేశారు.

Updated : 16 Apr 2024 06:12 IST

వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు శిలాఫలకం తొలగింపు

శిలాఫలకం తొలగించిన ప్రదేశం ఇదే..

మార్టేరు, న్యూస్‌టుడే: రెండేళ్ల కిందట పెనుమంట్ర మండలం మాముడూరులో ఆర్‌బీకే నిర్మాణానికి సాక్షాత్తు ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్నే మాయం చేసేశారు. 2021 జూన్‌ 19న స్థానిక ఎమ్మెల్యే ఆర్బీకే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారికి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు శిలాఫలకం దిష్టిబొమ్మలా కనిపిస్తూ ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్చిలో శిలాఫలకంతో కూడిన దిమ్మ నేలమట్టమయ్యింది. ఈ విషయమై మార్చి 9న ‘ఈనాడు’లో ‘నాడు అలా.. జాప్యమై నేడు ఇలా..!’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో దిమ్మ శకలాలను తొలగించి శిలాఫలకాన్ని అక్కడి నుంచి తరలించేశారు. వాస్తవానికి మండలంలో ముందస్తుగానే ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ ఆ దిశగా పనులు చేపట్టలేదు. ఎన్నికల వేళ పనులు ప్రారంభంగాని ఈ శిలాఫలకాన్ని      ఈ ప్రాంతం నుంచి తరలించడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని