logo

సివిల్స్‌లో మెరుపులు

 కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన యువతి గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ పరీక్షల్లో ప్రతిభ చాటారు.

Updated : 17 Apr 2024 06:33 IST

భానుశ్రీకి 198వ ర్యాంకు  

ఏలూరు కలెక్టరేట్‌, కాళ్ల, న్యూస్‌టుడే:  కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన యువతి గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ పరీక్షల్లో ప్రతిభ చాటారు. జాతీయ స్థాయిలో 198వ ర్యాంకు సాధించారు. ఈమె గతంలో గ్రూప్‌-1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు పొందడం ద్వారా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈమె తండ్రి రామాంజనేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి ఉష గృహిణి. భానుశ్రీ దిల్లీలోని ఓ కళాశాలలో బీఏ ఎకనమిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ చదివారు. చిన్నతనం నుంచి ఐఏఎస్‌ అధికారి కావాలనే ఆశయం ఉండేది. ఆమె లక్ష్య సాధనకు తండ్రి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీలో ఉత్తమ ర్యాంకు సాధించారు. ఐపీఎస్‌ లేదా ఐఆర్‌ఎస్‌ హోదా లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తాను  విజయాలు సాధించడానికి తండ్రి అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని భానుశ్రీ తెలిపారు. ఐఏఎస్‌ అధికారి కావాలనేది తన జీవితాశయమన్నారు.

శాసనమండలి ఛైర్మన్‌ కుమారుడికి 833వ ర్యాంకు

కొయ్యే చిట్టిరాజు

గునుపూడి, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:  సివిల్స్‌ ఫలితాల్లో శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేనురాజు కుమారుడు చిట్టిరాజు 833వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి మోసేనురాజు దంపతులు మిఠాయి తినిపించారు. గునుపూడి ప్రాంతంలో యువత సంబరాలు చేశారు. భీమవరంలో ప్రాథమిక విద్య అనంతరం ఏయూలో బీటెక్‌ పూర్తి చేసిన చిట్టిరాజు రెండేళ్ల పాటు ఇన్ఫోసిస్‌ సంస్థలో పనిచేశారు. సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో 2018 నుంచి దిల్లీలో  ఉంటూ పట్టుదలతో సాధన చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని