logo

ప్రజల ఆస్తుల స్వాహాకు జగన్‌ కుట్ర

ప్రజల ఆస్తులను స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తెచ్చారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

Published : 30 Apr 2024 06:47 IST

ఎంపీ రఘురామకృష్ణరాజు

కాళ్ల, న్యూస్‌టుడే: ప్రజల ఆస్తులను స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తెచ్చారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కొత్త చట్టం ప్రకారం.. ఎలాంటి భూ వివాదాలున్నా మూడు నెలల వ్యవధిలో సంబంధిత జిల్లా రెవెన్యూ అధికారి వద్ద పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సదరు జిల్లా రెవెన్యూ అధికారులు కచ్చితంగా తిరస్కరిస్తారు. అప్పుడు బాధితులు హైకోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం ఉండదు. ఈ విధానంలో సామాన్యులకు తీవ్ర నష్టం తప్పదు. భూముల రీ సర్వే పేరిట జగన్‌ చిత్రం ఉన్న పత్రాలు జారీ చేయడం హాస్యాస్పదం. ప్రజల ఆస్తి పత్రాలతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై కూడా ఫొటోలను ముద్రించుకోవడం జగన్‌ ప్రచార యావకు నిదర్శనం.’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని