logo

పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?

పాలకొల్లు నియోజకవర్గంలో పలు పోలింగ్‌ కేంద్రాల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్‌కు 10 రోజులు మాత్రమే ఉండటంతో ఆయా  కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 02 May 2024 05:00 IST

దొడ్డిపట్లలో 41వ నంబర్‌ కేంద్రానికి కేటాయించిన పశువుల ఆసుపత్రి
పాలకొల్లు, యలమంచిలి, న్యూస్‌టుడే: పాలకొల్లు నియోజకవర్గంలో పలు పోలింగ్‌ కేంద్రాల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్‌కు 10 రోజులు మాత్రమే ఉండటంతో ఆయా  కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 190 పోలింగ్‌ కేంద్రాలుండగా పలుచోట్ల భవనాల శ్లాబ్‌లు పెచ్చులూడుతున్నాయి. పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేసిన పలు పాఠశాలల్లో నాడు-నేడు పనులు జరుగుతుండటంతో గదులు చిందరవందరగా కనిపిస్తున్నాయి. అనేకచోట్ల మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎన్నికలకు ఒకరోజు ముందు పోలింగ్‌ సిబ్బంది బసచేయాల్సిన గదులు, ఈవీఎంలు భద్రపరచాల్సిన ప్రాంతాలు అభద్రతకు చిరునామాగా కనిపిస్తుండటం ఆందోళనకు దారితీస్తోంది. దొడ్డిపట్లలో పశువుల ఆసుపత్రి నిర్వహిస్తున్న భవనంలో 41వ నంబర్‌ పోలింగ్‌కేంద్రం ఏర్పాటు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగడపాలెం ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పనులు పూర్తవ్వని చోట 53వ నంబర్‌ పోలింగ్‌స్టేషన్‌ ఏర్పాటు తగదని స్థానికుడు అప్పలనరసింహరాజు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని