logo

18 నుంచి శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు

ద్వారకాతిరుమల శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.

Published : 05 May 2024 05:42 IST

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. మొదటి రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవం ఉంటుందన్నారు. 22న రాత్రి 8 గంటలకు స్వామివారి తిరుకల్యాణోత్సవం, 23న రాత్రి 7.30 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  

ఆలయంలో  రద్దీ.. శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 3గంటల సమయం పట్టింది. వృద్ధులు, దివ్యాంగులను ప్రత్యేక క్యూలలో దర్శనానికి అనుమతించారు. అయితే ఆలయ అధికారులు పలు మార్గలను మూసి వేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని