ఓటరు సమాచార చీటీలో స్వల్ప మార్పు
గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది
ఫొటో స్థానంలో క్యూఆర్ స్కానర్
కుక్కునూరు, న్యూస్‌టుడే: గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది. ఫొటోను తొలగించి, ఆ స్థానంలో క్యూఆర్ కోడ్ పొందుపర్చింది. ప్రస్తుతం వాటిని బీఎల్వోలు ఇంటింటికీ పంచుతున్నారు. వోటర్స్.ఈసీఐ.ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. సదరు ఓటర్ పేరు, వివరాలతోపాటు ఎపిక్ నెంబర్, క్రమసంఖ్య, పోలింగ్‌స్టేషన్ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఓటరు చీటి కేవలం వివరాల కోసం మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ఓటేయ్యాలంటే దాంతోపాటు ప్రభుత్వం గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..
[ 19-05-2024]
ఇతర దేశాల నుంచీ.. కువైట్, ఖతార్, సౌదీ ఆరేబియా తదితర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినవారు కూడా ఇక్కడి ఫలితాలపై పందేలకు సై అంటున్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
[ 19-05-2024]
భౌతికంగా తమ కుమారుడు మృతిచెందినా అవయవదానంతో మరొకరిలో చిరంజీవిగా జీవించే ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకరించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే!
[ 19-05-2024]
ముదినేపల్లి మండలం చిగురుకోట శివారు నరసన్నపాలెంలో ఎస్సీ శ్మశాన వాటికకు వెళ్లడానికి దారి లేదు. రొయ్యల చెరువుగట్లపై నుంచి మృతదేహాన్ని తీసుకు వెళ్లాల్సి వస్తోంది. -
పాలకొల్లు వైకాపాలో లుకలుకలు
[ 19-05-2024]
పాలకొల్లులో ప్రతిపక్షం గెలవడానికి వారికంటే వైకాపా నాయకులే ఎక్కువ సహకరించారని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం లేపుతోంది. -
చేలల్లోనే 20 శాతం పంట
[ 19-05-2024]
మూడు రోజుల నుంచి కురుస్తున్న జడివానలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశం మేఘావృతమై అకస్మాత్తుగా జల్లులు పడుతుండటంతో రబీ పంట మాసూళ్లకు అవరోధాలు ఎదురవుతున్నాయి. -
కమనీయం.. శ్రీనివాసుని తిరుకల్యాణం
[ 19-05-2024]
కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు శనివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి, అమ్మవార్లను నూతన వధూవరులుగా ముస్తాబు చేశారు. -
జయ జయ వాసవీ మాత!
[ 19-05-2024]
జై..వాసవీ..జైజై వాసవీమాత నామస్మరణతో పెనుగొండ మారుమోగింది. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా శనివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. -
ఆ నలుగురు నలిగిపోతున్నారు!
[ 19-05-2024]
శ్మశానవాటిక సమస్య లేని గ్రామం లేదు. అంతిమ సంస్కారం ముగిసే వరకు నిలబడటానికి నిలువ నీడ ఉండదు. దప్పికతీర్చే వసతి కనిపించదు. -
లక్షల్లో జీతాలా.. ఫలితాలు అంతంతమాత్రమా
[ 19-05-2024]
లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు... ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి... ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ ప్రశ్నించారు. -
ముంపుతో ముడి.. మావి ప్రాణాలు కావా?
[ 19-05-2024]
‘కురుములతోగు, కొత్తూరు కోసయ్యగుంపు గ్రామాలకు చెందిన 15 మంది అతిసారం బారిన పడ్డారు. సకాలంలో చికిత్స అందక ఇద్దరు తనువు చాలించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్‌తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్‌రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్‌నగర్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన