logo

మీ వెంకీ మామగా కోరుతున్నా

కైకలూరు నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఈ నెల 13వ తేదీన ప్రజలంతా బాధ్యతాయుతంగా కామినేని శీను మావయ్యకు ఓటేసి గెలిపించాలని ప్రముఖ సినీ కథానాయకుడు దగ్గుపాటి వెంకటేశ్‌ పిలుపునిచ్చారు.

Published : 09 May 2024 03:36 IST

కామినేనిని గెలిపించాలని హీరో వెంకటేష్‌ పిలుపు

అభివాదం చేస్తున్న వెంకటేశ్‌, పక్కన కూటమి అభ్యర్థి శ్రీనివాస్‌

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఈ నెల 13వ తేదీన ప్రజలంతా బాధ్యతాయుతంగా కామినేని శీను మావయ్యకు ఓటేసి గెలిపించాలని ప్రముఖ సినీ కథానాయకుడు దగ్గుపాటి వెంకటేశ్‌ పిలుపునిచ్చారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు మద్దతుగా ఆయన కలిదిండి మండలం పడమటిపాలెం నుంచి కైకలూరు వరకూ భారీ ప్రదర్శన చేపట్టారు.  గాంధీబొమ్మ కూడలిలో ప్రజలనుద్దేశించి వెంకటేశ్‌ మాట్లాడారు. ‘మంచితనానికి మారుపేరు శీను మావయ్య. మాట ఇస్తే తప్పకుండా నేరవేరుస్తారు. మీ వెంకీమామగా...పెళ్లికాని ప్రసాద్‌గా.... చంటిగా కోరుతున్నా... కమలం గుర్తుకు ఓటేసి కామినేనిని భారీ మెజార్టీతో గెలిపించండి. కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ... వెంకటేష్‌ రాజకీయాలకు దూరంగా ఉంటారని... గతంలో ఆయన తండ్రి రామానాయుడు, ప్రస్తుతం తన కోసం మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని