logo

రొయ్యకు ‘జగన్‌ వైరస్‌’

రొయ్యల పంటకు వైరస్‌ల బెడద ఎక్కువ. వాటి ప్రభావం గుర్తించేలోపే చెరువులో రొయ్యలన్నీ కళ్లు తేలేస్తాయి.

Published : 09 May 2024 03:57 IST

వైకాపా సర్కారు నిర్ణయాలతో ఆక్వా కుదేలు
పడిపోయిన సాగు విస్తీర్ణం, ఎగుమతులు
అనుబంధ రంగాలపైనా తీవ్ర ప్రభావం
సాగుదారులపై మోయలేని భారం

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: రొయ్యల పంటకు వైరస్‌ల బెడద ఎక్కువ. వాటి ప్రభావం గుర్తించేలోపే చెరువులో రొయ్యలన్నీ కళ్లు తేలేస్తాయి. రోజుల వ్యవధిలో చుట్టుపక్కల చెరువులన్నింటినీ వైరస్‌ చుట్టబెట్టి ఖాళీ చేసేస్తుంది. గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి వైరస్‌ల కారణంగా సాగుదారులు తీవ్ర నష్టాలు చవిచూసినా తట్టుకొని నిలబడ్డారు. గతంలో వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు, ధరల తగ్గడం వల్ల ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఈ రంగం ఈసారి మాత్రం జగన్‌ సర్కారు విధానాలతో సంక్షోభంలో చిక్కుకుని తిరోగమనంలో సాగుతోంది. ఈ క్రమంలో కొందరు సాగును విరమించుకుంటున్నారు.

జిల్లా నుంచి నిత్యం 350 నుంచి 450 లారీల్లో చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం 200 లారీలు మాత్రమే వెళ్తున్నాయి.

అప్సడా పేరిట కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందేనంటూ సర్కారు హుకుం జారీ చేసింది. ఏదో మేలు కోసమే ప్రభుత్వం అలా చేస్తుందని నమ్మిన వారికి కొద్ది రోజుల్లోనే భ్రమలు తొలగిపోయాయి. ఈ చట్టంతో ఎలాంటి ప్రయోజనం లేకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి.

  • మేతలు, సీడ్‌ ధరలు అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారు. ధరలు తగ్గి నష్టపోతున్నామంటూ రైతులు వాపోయిన ప్రతిసారీ దాన్ని కారణంగా చూపి ఎగుమతి సంస్థలపై విరుచుకుపడి బెదిరింపులకు గురిచేసి కొన్ని వ్యవహారాలు చక్కబెట్టారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
  • గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విద్యుత్తు రాయితీలో కోత పెట్టి నిబంధనల పేరిట సాగుదారులపై పెనుభారం మోపారు. రొయ్యల ధర నిర్ణయంలో దళారులు, ఎగుమతిదారుల పాత్రను నియంత్రించడంలో  ప్రభుత్వం విఫలమైంది.

ఎంతో వ్యత్యాసం

గత ప్రభుత్వం రొయ్యల చెరువుల వద్ద విద్యుత్తు పరివర్తకాలకు రాయితీ ఇచ్చి ప్రోత్సహించింది. ప్రస్తుత పాలకులు దాన్ని పూర్తిగా ఎత్తేశారు. నాటితో పోల్చితే పరివర్తకాల ఏర్పాటుకు రైతులపై పడుతున్న భారం (రూపాయల్లో) ఇలా..
ఉమ్మడి పశ్చిమగోదావరి నుంచి గతంలో ఏటా 3.5 లక్షల టన్నుల రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. గత రెండేళ్లలో ఇది 1.5 లక్షల టన్నులకు పడిపోయింది. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో రొయ్యల సాగులో కష్టాలు పెరిగిపోయాయి.

ఇలా తిరోగమనం (ఎకరాల్లో) ఆక్వాసాగు విస్తీర్ణం 3.12 లక్షలు
చేపల సాగు 1.94 ,,
రొయ్యల సాగు 1.18  ,,
అయిదేళ్లలో తగ్గిన విస్తీర్ణం 45 వేలు
ఉమ్మడి జిల్లాలో ఉత్పత్తి అయ్యే రొయ్యలు, చేపల ద్వారా జరిగే వార్షిక టర్నోవర్‌ రూ.27 వేల కోట్లు (సుమారు)

పెరిగిన ధరల కారణంగా ఎకరాకు 3 టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసే రైతుపై పడే భారం (రూపాయల్లో) ఇలా..

మేత 89,995
విద్యుత్తు ఛార్జీ 45,684
డీజిల్‌ ఖర్చు 43,470
మొత్తం 1,79,049

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని