logo

తాయిలాల పంపిణీ లేకుండా నిఘా : కలెక్టర్‌

ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో 72 గంటల పాటు అమల్లో ఉంటుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

Published : 10 May 2024 04:08 IST

బీవీ రాజు కళాశాల ప్రాంగణంలో స్ట్రాంగ్‌రూముల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న సుమిత్‌కుమార్‌

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే:  ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో 72 గంటల పాటు అమల్లో ఉంటుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఆర్వోలు, సంబంధిత అధికారులతో ఆయన గురువారం కలెక్టరేట్‌ నుంచి దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరినందున అధికారులు, నిఘా బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఓటర్లకు నగదు, తాయిలాలు పంపిణీ చేసే అవకాశం లేకుండా నిఘా పెట్టాలన్నారు. ఈ విషయంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేయాలన్నారు. స్ట్రాంగురూముల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌  సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆచంట నియోజకవర్గానికి సంబంధించి భీమవరంలోని బీవీ రాజు కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగురూములు, లెక్కింపు కేంద్రాలను  పరిశీలించారు.

ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు : ఎస్పీ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ వి.అజిత పేర్కొన్నారు. ఎన్నికల విధుల నిమిత్తం జిల్లాకు వచ్చిన కేంద్ర సాయుధ బలగాలు, నాగాలాండ్‌ పోలీసు అధికారులతో సమీక్షను తన కార్యాలయంలో గురువారం నిర్వహించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని