logo

సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా : డీఐజీ

ఓట్ల లెక్కింపు రోజున ఆయా జిల్లాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కర్నూలు రేంజ్‌ డీఐజీ సీహెచ్‌ విజయరావు ఆదేశించారు. ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు అధికారులతో మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచాలన్నారు.

Published : 23 May 2024 03:22 IST

 వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కర్నూలు రేంజ్‌ డీఐజీ సీహెచ్‌ విజయరావు 

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపు రోజున ఆయా జిల్లాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కర్నూలు రేంజ్‌ డీఐజీ సీహెచ్‌ విజయరావు ఆదేశించారు. ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు అధికారులతో మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచాలన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి  ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కేవలం ఏజెంట్లు, అభ్యర్థులు మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెట్రోలు బంకుల వద్ద సీసాలు, క్యాన్లకు పెట్రోలు పోయకుండా నిఘా ఉంచాలన్నారు. మే 30 నుంచి జిల్లాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ సుధాకర్, డీఎస్పీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని