logo

రాజంపేటలో గంటన్నరకు పైగా నిలిచిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

రాజంపేట మండలం హస్తవరం రైలునిలయంలో సిగ్నలింగ్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపంతో కన్యాకుమారి-ఫుణె ఎక్స్‌ప్రెస్‌ రైలు రాజంపేట రైలునిలయంలో బుధవారం  1.40 గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Published : 23 May 2024 03:32 IST

రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం 

రాజంపేట, న్యూస్‌టుడే: రాజంపేట మండలం హస్తవరం రైలునిలయంలో సిగ్నలింగ్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపంతో కన్యాకుమారి-ఫుణె ఎక్స్‌ప్రెస్‌ రైలు రాజంపేట రైలునిలయంలో బుధవారం  1.40 గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రైలు రాజంపేటకు బుధవారం ఉదయం 6.06 గంటలకు చేరుకోగా, హస్తవరంలో తలెత్తిన లోపంతో నిలిపివేశారు. వెంటనే రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎట్టకేలకు 7.50 గంటల ప్రాంతంలో రైలు కదలడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని