logo

Kadapa: నెలలో 101 సార్లు ఫోన్‌.. వాహన షోరూంపై బాధితుడు ఫిర్యాదు

క్రెడిట్‌ కార్డులు, సర్వీసింగ్‌, రీఛార్జి పేరిట తరచూ ఫోన్‌కాల్స్‌ వస్తుంటాయి..  ఆ నెంబర్లను బ్లాక్‌ చేసినా మార్చి చేస్తుంటారు..

Updated : 01 Dec 2023 07:42 IST

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: క్రెడిట్‌ కార్డులు, సర్వీసింగ్‌, రీఛార్జి పేరిట తరచూ ఫోన్‌కాల్స్‌ వస్తుంటాయి..  ఆ నెంబర్లను బ్లాక్‌ చేసినా మార్చి చేస్తుంటారు.. దీంతో వినియోగదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇలా ఓ వ్యక్తికి ఒకటి కాదు.. రెండు కాదు.. నెలలో 101 సార్లు ఫోన్‌ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో ఒకటో పట్టణ ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి... కడప మోచంపేటకు చెందిన దిలీప్‌ ఏడాది కిందట నగరంలోని ఓ షోరూంలో ద్విచక్రవాహనం కొన్నారు. అప్పుడప్పుడు అక్కడి సిబ్బంది ఫోన్లు చేసి సర్వీసు ఎలా ఉందని అడిగితే, బాగానే ఉందని చెప్పేవారు. నవంబరులో ఏకంగా 101 సార్లు ఫోన్లు చేశారు. అప్పటికీ ఆ నంబర్లను బ్లాక్‌లో పెట్టినా, 39 వేర్వేరు నంబర్ల నుంచి చేశారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల చరవాణికి కాల్స్‌ వచ్చాయి. పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారిలో మార్పు రాలేదు. పైగా బాధితులనే బెదిరించారు. దీంతో దిలీప్‌ పోలీసులను ఆశ్రయించారు. వారు కంపెనీ సిబ్బందిని పిలిపించి మందలించారు. మరోసారి ఫోన్‌ వస్తే కేసు నమోదు చేస్తామని  హెచ్చరించి పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని