logo

గనులు దోచుకుని పెద్దల్లా చలామణి: నల్లారి

వైకాపా నేతలు గనులను దోచుకుని పెద్దల్లా చలామణి అవుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 16 Apr 2024 02:15 IST

గుర్రంకొండ, పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: వైకాపా నేతలు గనులను దోచుకుని పెద్దల్లా చలామణి అవుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. గుర్రంకొండలో సోమవారం ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి ‘బాబు స్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. అయిదేళ్లుగా భూములను కబ్జా చేయడమే కాకుండా ప్రజలతోపాటు ప్రకృతి సంపదను జలగల్లా పీల్చిపిప్పి చేసిన వైకాపా ప్రభుత్వ పాలకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.పీలేరులో సోమవారం రాత్రి నల్లారి ముస్లింలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భాజపాతో పొత్తుతో ముస్లింలకు మేలు జరుగుతుందని హామీ ఇచ్చారు. సీఏఏ చట్టానికి పార్లమెంటులో మద్దతు ఇచ్చిన వైకాపా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అపోహలు, అభద్రతాభావాన్ని వీడి కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైకాపా గుర్రంకొండ మండల మాజీ కన్వీనర్‌ మనోహర్‌ రెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు, పీలేరుకు చెందిన మైనార్టీ నాయకులు అతికా షఫీవుల్లా, శ్రీహరిరెడ్డి ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు తెదేపాలో చేరారు. కార్యక్రమాల్లో నాయకులు రఘురామిరెడ్డి, నౌషాద్‌, జగదీష్‌, మురళి, సతీష్‌, సుధాకర్‌, శ్రీనివాసులు, రెడ్డిశేఖర్‌, హరియాదవ్‌, హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని