logo

కూటమి గెలుపు... అభివృద్ధికి మలుపు

‘జగన్‌ లాంటి అసమర్థుడి చేతిలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది... సామాన్యుల జీవితాలు మళ్లీ గాడినపడాలంటే కూటమి అభ్యర్థుల విజయం ఎంతో అవసరం.

Published : 16 Apr 2024 02:17 IST

జగన్‌ అయిదేళ్ల అసమర్థ పాలనతో కష్టాలు
వచ్చే ఎన్నికల్లో బలిజలు ఐక్యత చాటాలి
ఆత్మీయసభలో కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : ‘జగన్‌ లాంటి అసమర్థుడి చేతిలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది... సామాన్యుల జీవితాలు మళ్లీ గాడినపడాలంటే కూటమి అభ్యర్థుల విజయం ఎంతో అవసరం. ఈ ఎన్నికల్లో బలిజలు ఐక్యతను చాటి కూటమి విజయానికి బాటలు వేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే, కాపు సంఘం ప్రతినిధి వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మదనపల్లెలో సోమవారం జనసేన పార్టీ నాయకుడు శ్రీరామ రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన బలిజ, కాపు సంఘాల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదలకు సెంటు భూమిలో ఇల్లు ఇచ్చామని చెబుతున్న వైకాపా నేతలు వేల ఎకరాలు కబ్జాలు చేశారని ఆరోపించారు. సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగిందని గగ్గోలు పెడుతున్న ఆ పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులపై నింద మోపేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని ప్రజల ముందు నిలబెట్టాలని డిమాండు చేశారు. తెదేపా మదనపల్లె నియోజకవర్గ అభ్యర్థి షాజహాన్‌బాషా మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే  ఎకరా స్థలం, రూ.1.50 కోట్లు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. అనంతరం వంగవీటి రాధాకృష్ణను బలిజ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, శివరామ్‌, కిరణ్‌, ఆంజనేయకుమార్‌, విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని