logo

ఇసుక మింగేస్తున్నారు... మురుగు నింపేస్తున్నారు..!

సీఎం జగన్‌ పాలనలో వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని నదులు అధికార వైకాపాకు చెందిన ఇసుకాసురులకు ప్రధాన ఆదాయ వనరుగా, మురుగును నింపేసే ప్రాంతాలుగా మారిపోయాయి.

Published : 16 Apr 2024 02:36 IST

సీఎం జగన్‌ పాలనలో వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని నదులు అధికార వైకాపాకు చెందిన ఇసుకాసురులకు ప్రధాన ఆదాయ వనరుగా, మురుగును నింపేసే ప్రాంతాలుగా మారిపోయాయి. అందులోనూ మురుగునీటిని శుద్ధి చేయకుండా నేరుగా నదుల్లోకి వదిలేస్తుండడంతో ప్రజల దాహార్తి తీర్చే పెన్నా, పాపఘ్ని, బాహుదా, మాండవ్య, కుందూ, సత్యవతి, గుంజనేరు, సగిలేరు తదితర నదులు కాలుష్య కాసారాలుగా తయారయ్యాయి. మురుగునీటి శుద్ధికి సత్వర చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు ఘోషిస్తున్నా, కాలుష్యనియంత్రణ మండలి ఆదేశిస్తున్నా జగన్‌ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో మురుగుశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం రూ.కోట్ల నిధులిచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. మాటలే తప్ప చేతలు లేని వైకాపా ప్రభుత్వ తీరుతో ప్రజలకు స్వచ్ఛజలం కరవవ్వడమే కాకుండా కలుషిత నీటిని తాగుతూ రోగాల బారిన పడుతుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని