logo

చెలమనీటికీ చెమట చిందించాల్సిందే..!

పెన్నా నదీతీరంలోని ఒంటిమిట్ట మండలం దర్జిపల్లిలో తాగునీటి సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. గ్రామంలో పంచాయతీ బోరునీరు వంట, తాగడానికి అనువుగా లేదు.

Published : 16 Apr 2024 02:39 IST

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట: పెన్నా నదీతీరంలోని ఒంటిమిట్ట మండలం దర్జిపల్లిలో తాగునీటి సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. గ్రామంలో పంచాయతీ బోరునీరు వంట, తాగడానికి అనువుగా లేదు. గ్రామంలో 75 కుటుంబాల్లో 280 మంది నివాసం ఉంటున్నారు. కొందమంది ప్రైవేటుగా తాగునీటిని కొనుగోలు చేసుకుంటుండడగా, చాలామంది బిందెలు పట్టుకుని గ్రామసమీపంలోని పెన్నమ్మ చెంతకు వెళుతున్నారు. అక్కడ చెలమల్లో ఊటనీరు తోడుకుంటున్నారు. గతంలో ఒకటి, రెండు అడుగుల్లోనే ఊట నీరు లభించేదని, వైకాపా పాలనలో ఇసుకాసురులు యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో 15 అడుగుల లోతులోకి జలసిరి జారి పోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రస్తుతం ఎండల్లో నది మధ్యకు వెళ్లి నీరు తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని