logo

అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు.

Published : 20 Apr 2024 04:18 IST

ప్రొద్దుటూరు వైద్యం, రాజుపాళెం, జమ్మలమడుగు, కొండాపురం, ఖాజీపేట, మైదుకూరు, బి.కోడూరు, బద్వేలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని శ్రీరామ్‌ నగర్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తెదేపాను గెలిపించాలని ఆయన కోరారు. తెదేపా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. ఆ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మరోసారి వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి అథోగతి పాలవుతుందన్నారు.

రాజుపాళెం మండలంలోని పగిడాల, కూలూరు, దద్దనాల గ్రామాల్లో ప్రచారం చేశారు. జమ్మలమడుగు పట్టణంలో కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్‌రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సంయుక్తంగా ర్యాలీ చేపట్టారు. వీరి సమక్షంలో కొండాపురం మండలంలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రామిరెడ్డి, లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో 15 కుటుంబాలు, లావనూరులో ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ నారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచి లక్ష్మీనరసింహులుతో పాటు 150 కుటుంబాలు తెదేపాలో చేరాయి. మైదుకూరు ఎన్డీయే అభ్యర్ధి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సమక్షంలో ఖాజీపేటలోని సుంకేసులలో వైకాపాకు చెందిన 60 కుటుంబాలు తెదేపాలో చేరాయి. అనంతరం ఆయన మైదుకూరులోని వీధుల్లో ప్రచారం చేశారు. ఇక్కడ డీఎల్‌ యువసేనకు చెందిన కొండపల్లి హరి, ఇనుకొల్లు అమర్నాథరెడ్డి, భూపాలం సంతోష్‌, శ్రావణ్‌, స్థానిక ఆర్‌ఎంపీ షబ్బీర్‌ బాషా వారి అనుచరులతో తెదేపాలో చేరారు. బి.కోడూరు మండలంలోని పాయలకుంట్ల, రామచంద్రాపురం, కాసానగరం గ్రామాల్లో బద్వేలు భాజపా అభ్యర్థి బొజ్జా రోశన్న స్థానిక నాయకులు రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డితోపాటు ప్రచారం చేశారు. బద్వేలు పట్టణంలోని విద్యానగర్‌లో ఇంటింటి ప్రచారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని