logo

షర్మిలకు ఓటేయాలని పిలుపు

అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె డాక్టరు సునీత పేర్కొన్నారు.

Published : 05 May 2024 04:56 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతారెడ్డి, పక్కన కాంగ్రెస్‌ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి

కొండాపురం, న్యూస్‌టుడే: అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె డాక్టరు సునీత పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె నుంచి కొండాపురం వరకు రోడ్‌ షోలో సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయిదేళ్లగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటానికి షర్మిల మద్దతుగా నిలిచారన్నారు. కాంగ్రెస్‌ తరపున కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల, జమ్మలమడుగు అభ్యర్థిగా బరిలో నిలిచిన బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరారు. హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. రాష్ట్రమంతటా వైఎస్‌ఆర్‌, వివేకాలను ప్రజలు అభిమానిస్తారన్నారు. తన తండ్రిని గొడ్డలితో నరికి చంపారని..వైఎస్‌ఆర్‌ బతికి ఉంటే సహించేవారు కాదన్నారు. రాజశేఖర్‌రెడ్డిని దురదృష్టవశాతు దేవుడు తీసుకువెళ్తే వివేకానందరెడ్డి మనకోసం పని చేస్తుండగా అతి దారుణంగా కిరాతనంగా హత్య చేసి మన దగ్గర లేకుండా చేశారని కంటతడి పెట్టారు. పలువురు గండికోట ముంపువాసులు పరిహారం రాలేదని తెలుపగా..సొంత చినాన్నకే న్యాయం జరగకుంటే మీకు ఎట్లా న్యాయం చేస్తారని వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు, ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని