logo

పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ 84.05 శాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ఆదివారం నిర్వహించారు. మొత్తం 84.05 శాతం పోలింగ్‌ నమోదైంది. అందులో భాగంగా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 1904 మంది ఓటర్లు ఉండగా, 1,661 మంది ఓటుహక్కు (87.24 శాతం) వినియోగించుకున్నారు.

Published : 06 May 2024 04:22 IST

కడపలో ఓటరు స్లిప్పులు సరిచూసుకుంటున్న ఉద్యోగులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ఆదివారం నిర్వహించారు. మొత్తం 84.05 శాతం పోలింగ్‌ నమోదైంది. అందులో భాగంగా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 1904 మంది ఓటర్లు ఉండగా, 1,661 మంది ఓటుహక్కు (87.24 శాతం) వినియోగించుకున్నారు. కడపలో 3,204 మందికి 2,700 మంది (84.14 శాతం), పులివెందులలో 87.63, కమలాపురంలో 78.29, జమ్మలమడుగులో 90.65, ప్రొద్దుటూరులో 94.34,  మైదుకూరులో 96.80 శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో పాటు ఇతర జిల్లాల పోస్టల్‌ బ్యాలట్‌కు సంబంధించి 2,004 మంది దరఖాస్తు చేసుకోగా, 1,113 మంది (55.54 శాతం) సద్వినియోగం చేసుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని