logo

వైకాపాను గెలిపిస్తే అభివృద్ధి పాతాళానికే!

వైకాపాను మళ్లీ గెలిపించుకుంటే మదనపల్లె నియోజకవర్గం 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోతోందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 07 May 2024 05:41 IST

రోడ్‌షోలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి

మదనపల్లె పట్టణం: వైకాపాను మళ్లీ గెలిపించుకుంటే మదనపల్లె నియోజకవర్గం 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోతోందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... మల్లెల మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. నియోజకవర్గంలోని యువతను ఆదుకోవడానికి యువ వికాసం కార్యక్రమం ద్వారా ఏటా జాబ్‌మేళా నిర్వహించి 5 వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న 9 గ్యారంటీలు కాకుండా తన సొంత మల్లెల ఫౌండేషన్‌ కింద మరికొన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. మహిళా చిరు వ్యాపారులకు రూ.25 వేలు వడ్డీలేని రుణాలు ఇస్తానని, ఈ డబ్బును వారు వాయిదాలు రూపంలో చెల్లించుకోవచ్చని చెప్పారు. మల్లెల ఆరోగ్య భరోసా కార్యక్రమం కింద ప్రతి మండలంలో నెలకు ఒకసారి ఉచిత వైద్యశిబిరం నిర్వహించి పేదలకు చికిత్సలు అందజేస్తానని తెలిపారు. ఏటా 2,500 మంది వృద్ధులకు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలు దర్శనం చేయిస్తానన్నారు. మల్లెల క్రీడావికాసం కార్యక్రమం కింద మదనపల్లెలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణంతో పాటు ప్రతి మండలం కేంద్రంలో క్రికెట్‌ ప్రాక్టీస్‌ నెట్స్‌ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. వైకాపా నాయకులు ప్రజల నుంచి దోచేసిన డబ్బు తిరిగి వారికి ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని తెలిపారు. ఈ సారి డబ్బుతో రాజకీయం జరగదని, అరాచక పాలన నుంచి మదనపల్లెను కాపాడుకోవాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో మదనపల్లె 20 సంవత్సరాలు అభివృద్ధిలో వెనుకపడిందని, ఈసారి కాపాడుకోలేని పక్షంలో మరో 20 సంవత్సరాలు వెనక్కు వెళ్లిపోతామన్న భావన ప్రజల్లో ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని